జ్యోతిష్యులు చెప్పే..పరిహారాలు చేస్తే పనులు అవుతాయా?..ఎంతవరకూ నమ్మచ్చు?

updated: March 4, 2018 18:16 IST
జ్యోతిష్యులు చెప్పే..పరిహారాలు చేస్తే పనులు అవుతాయా?..ఎంతవరకూ నమ్మచ్చు?

జ్యోతిషం ఈ రోజుల్లో  సర్వ వ్యాప్తమైపోయింది. జ్యోతిషానికి ప్రజాదరణ విపరీతంగా ఉండడంచేత ప్రతీ పత్రికా దిన పత్రికల్లో కాక టీవీ ఛానెల్స్ లో సైతం  వారఫలాలు, దినఫలాలు చెప్పటం తప్పనిసరి అయింది.  దానికి తోడు ఇంటర్నెట్ వచ్చాకా జ్యోతిషానికి సంబంధించిన సైట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిసాయి. దాంతో జ్యోతిష్కులతో ప్రశ్న జవాబుల శీర్షికలు పెట్టడం, పరిహారాలు ఆన్ లైన్ లోనో, టీవీ లైవ్ లోనే  వారు చెప్పటం జరుగుతోంది.  శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోకూడా ఏమిటీ నమ్మకాలు అని పెదవి విరిచేవారు కొందరైతే జ్యోతిషం కూడా సైన్సే అనేవాళ్ళు మరికొందరు ఉన్నారు. ఏది ఏమైనా జ్యోతిషానికి ఉన్న ఆకర్షణశక్తి అసాధారణమైనది అనేది నిజం.

అలాగే చాలా మందికి జ్యోతిష్యంలో చెప్పే పరిహారాల గురించి సందేహాలున్నాయి. జపాలు పూజలు చేస్తే పని అవుతుందా, జపాలు, పూజలు చేసాం కదా మళ్లీ పని విషయంలో కష్టపడటం ఎందుకు అని. 

దానికి ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ సంతోష్ కుమార్ శర్మగారు...రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా  సమాధానం ఇవ్వటం జరిగింది. అదే మీ ముందు ఉంచుతున్నాం..... "మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు రోడుకు అడ్డంగా రాళ్లు ఉంటే, వాటిని తొలగించి ముందుకు వెళతాం, అలాగే మన జాతకరీత్యా ఏవైనా దోషాలుంటే పరిహారాలతో వాటిని తొలగించుకుని ముందుకు వెళతాం. రోడ్డు మీద రాళ్లు తొలగించినంత మాత్రాన నడవకుండా మనం గమ్యం ఎలాగైతే చేరలేమో, కేవలం పరిహారాలు చేసి పనిచేయకున్న అనుకున్న ఫలితాన్ని పొందము. జ్యోతిషం సరైన మార్గాన్ని సూచిస్తుంది, మన శ్రమ మాత్రమే మనను గమ్యానికి చేరుస్తుంది. అది ఉద్యోగం అయినా, విద్య అయినా లేక సంతానం అయినా పరిహారాలతో పాటు మానవ ప్రయత్నమూ ఉండాలి." అన్నారు.  

సంతోష్ కుమార్ శర్మగారు... మాస్టర్స్ డిగ్రి పూర్తి చేసి.. జ్యోతిష శాస్త్రాన్ని కూడా చదివి ఆన్ లైన్ జ్యోతిష్యానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మణికొండలో ఉంటూ www.onlinejyotish.com ద్వారా  దేశ, విదేశాలకి చెందిన చాలా మందికి తన జ్యోతిష్య సేవలు అందిస్తున్నారు. 14 ఏండ్లుగా ఆన్ లైన్ లో జ్యోతిష్య సేవలు అందిస్తున్నానని చెబుతున్నారు సంతోష్ శర్మ. అమెరికాతో పాటు వివిధ దేశాలకి చెందిన క్లయింట్స్ కి జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారన్నారు

comments